మడిపోతున్న టమోటా ధరలకు.. రైతులకు కనకవర్షం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోయింది. అనేక ప్రాంతాల్లో డబుల్ సెంచరీ కొట్టేసాయి. అయినప్పటికీ పాలకులు మాత్రం ఈ ధరల నియంత్రణకు ఏమాత్రం చర్యలు చేపట్టిన పాపాన పోలేదు. అదేసమయంలో టమోటా రైతు సాగులకు మాత్రం ఇది ఓ సువర్ణావకాశంగా మారింది. దీంతో అనేక మంది టమోటా రైతులు తమ జీవితకాలంలో చూడని విధంగా కాసులు చూస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. తాజాగా ఓ పేద రైతు ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. సాధారణ రోజులతో పోలిస్తే 20 రెట్లు అధిక ధరకు టమోటాలు అమ్ముడు పోతున్నాయి. దీంతో 2023 సంవత్సరం అనేక మంది టమోటా రైతులకు చిరస్మరణీయ యేడాదిగా మిగిపోయింది.
రంగారెడ్డి జిల్లా పులుమామిడి గ్రామానికి చెందిన కె.అనంతరెడ్డి అనే రైతు ఒక ఎకరా టమోటా పంటపై రూ.20 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో ఆయన ఒక కొత్త ట్రాక్టర్, హ్యూండాయ్ వెన్యూ కారును కొనుగోలు చేశారు. అలాగే, కర్నాటక రాష్ట్రంలోని జలబిగనపల్లి గ్రామానికి చెందిన 35 యేళ్ల అరవింద్ అనే రైతు ఐదు ఎకరాల్లో టమోటా పంటను సాగు చేయగా, ఆయనకు ఈ యేడాది రూ.1.4 కోట్లు మేరకు ఆదాయం వచ్చింది. తన తల్లి కోసం ఓ ఇంటిని కొనుగోలు చేశాడు.
అలాగే, ఏపీలోని కరకమండ గ్రామానికి చెందిన గ్రామ సోదరులైన పాసలప్పగారి చంద్రమౌళి, మురళిలు టమోటా పంటతో రూ.3 కోట్లు అర్జించారు. సాధారణంగా మామూలు రోజుల్లో వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. 20 కేజీల టమోటాలు సాధారణంగా డిమాండ్ రోజుల్లో రూ.200 నుంచి రూ.300 ధర పలుకుతుంది. కానీ ఇపుడు వేలల్లో పలుకుతుంది. దీంతో రైతుల కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు.