శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:57 IST)

జక్కన్న మల్టీస్టారర్.. చెర్రీకి, ఎన్టీఆర్‌లకు పారితోషికం లేదా?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వీరు భారీగా పారితోషికం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరికి చెరొక రూ.30 కోట్ల పారితోషికం అందేలా చూస్తారని టాక్. ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. 
 
భారీ బడ్జెట్ సినిమా కావడంతో పనిచేసే చీఫ్ టెక్నీషియన్స్‌కి, నటీనటులకు.. రాజమౌళితో సహా ఎవరికీ రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ప్లాన్ చేశాడు నిర్మాత డివివి దానయ్య. ఈ లెక్కన హీరోలకి ఎంత వస్తుందనే విషయంపై రూ.30 కోట్లు వస్తుందని టాక్. సినిమా బిజినెస్‌ని బట్టి చరణ్, ఎన్టీఆర్‌లకి చెరొక రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. 
 
రాజమౌళికి ఎలా లేదన్నా.. రూ.50-60 కోట్లు వరకు వచ్చే అవకాశం వుంది. సినిమా హక్కులు గనుక ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాలకి అమ్ముడైతే అప్పుడు పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.