ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (14:47 IST)

టాలీవుడ్ స్టార్ ఐటం గర్ల్‌గా రత్తాలు.. లక్ష్మీరాయ్ ఫోటోలతో లారెన్స్ ప్రమోట్

టాలీవుడ్ చిత్రాల్లో ఐటం సాంగ్ అనేది ఓ కామన్ ఫార్ములాగా మారిపోయింది. ఖచ్చితంగా ఓ ఐటం సాంగ్ ఉండేలా దర్శకనిర్మాతలతో పాటు హీరో ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ తరహా పాటల్లో నర్తించేందుకు హీరోలతో పాటు.. హీరోయిన

టాలీవుడ్ చిత్రాల్లో ఐటం సాంగ్ అనేది ఓ కామన్ ఫార్ములాగా మారిపోయింది. ఖచ్చితంగా ఓ ఐటం సాంగ్ ఉండేలా దర్శకనిర్మాతలతో పాటు హీరో ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ తరహా పాటల్లో నర్తించేందుకు హీరోలతో పాటు.. హీరోయిన్లు కూడా పోటీపడుతున్నారు.
 
దీనికి కారణం లేకపోలేదు.. తాము చూసిన సినిమా బాగున్నాబాగోలేక పోయినా... ఐటం సాంగ్ మాత్రం గుర్తుంటోంది. ఈమధ్య "సర్దార్ గబ్బర్ సింగ్‌"లో తోబ తోబ పాట, రీసెంట్‌దా "ఖైదీ నంబర్ 150"లో రత్తాలు రత్తాలు సాంగ్ ఆడియన్స్‌ను ఓ రకమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాయి. ఆ రెండు పాటల్లో యాక్ట్ చేసిన లక్ష్మీ రాయ్ క్రేజీ ఐటం గాళ్ మారిపోయింది. 
 
తోబ తోబ, రత్తాలు రత్తాలు సాంగ్స్ యమహోగా హిట్ కావడంతో రాయ్ లక్ష్మి క్రేజీ స్టార్ అయింది. పక్కా మాస్ మసాలా ఐటం సాంగ్స్ చేస్తుందని పేరు తెచ్చుకుంది కూడా. అందుకే రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "మొట్ట శివ కెట్ట శివ"లోను రాయ్ ఓ ఐటెం సాంగ్ చేయనుందట. తన సినిమాకు రాయ్ ఫోటోలతో లారెన్స్ ప్రమోట్ చేసుకుంటున్నాడంటే ఈ అమ్మడి క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.