బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 30 నవంబరు 2017 (18:33 IST)

మెగా ఫ్యామిలీ సభ్యుడిని అలా వాడతానంటున్న ప్రముఖ దర్శకుడు..?

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వెరైటీ కథలతో, కొత్త నటీనటులతో సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసిన సినిమాలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే చిత్రాలను తీస్తుంటారు చంద్రశేఖర్ యేలేటి. ఐతే, ఒక్కడున్నాడు, ఒకరోజు, మనమంతా ఈ సినిమా

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వెరైటీ కథలతో, కొత్త నటీనటులతో సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసిన సినిమాలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే చిత్రాలను తీస్తుంటారు చంద్రశేఖర్ యేలేటి. ఐతే, ఒక్కడున్నాడు, ఒకరోజు, మనమంతా ఈ సినిమాలు మంచి విజయాన్నే సాధించాయి.
 
తన కథకు తగ్గట్లే సినిమాలోని నటీనటులను ఎంచుకుంటారు చంద్రశేఖర్. ఎంతోమంది కొత్త నటీనటులను పరిచయం చేసి పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం చంద్రశేఖర్ చూపు మెగా ఫ్యామిలీలోని సాయిధరమ్ తేజ్ పైన పడ్డాయి. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కథను సిద్థం చేసుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. తన సినిమాకి హీరోను ఒప్పించడమే కాకుండా అందులోని తారాగణం మొత్తాన్ని ఇప్పటికే నిర్ణయించేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.