బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2017 (21:31 IST)

రెజీనా వివాహం అంటూ రచ్చరచ్చగా గుసగుస

ఎస్.ఎం.ఎస్. చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది చెన్నై సుందరి రెజీనా. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు అందుకుంది. పిల్లా నువ్వులేని జీవితం చిత్రంలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది. ఆ తరువాత సుబ్రమణ్యం ఫర్ సేల్

ఎస్.ఎం.ఎస్. చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది చెన్నై సుందరి రెజీనా. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు అందుకుంది. పిల్లా నువ్వులేని జీవితం చిత్రంలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది. ఆ తరువాత సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో యువ హీరోతో సందడి చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
 
ఆ ప్రచారం మరింత జోరందుకుంది. వీరి వ్యవహారం పెళ్ళి వరకు వెళ్ళడం జరిగిందనే వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుతున్నాయి. కానీ అదంతా ట్రాష్ అని ఒకవైపు సాయిధరమ్ తేజ్ చెపుతున్నప్పటికీ వారికి సంబంధించిన విషయాలు వస్తూనే వున్నాయి. రెజీనాను సాయిధరమ్ చేసుకోవడం ఖాయం అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి వుంది.