శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:27 IST)

కళ్లారా చూస్తే నమ్మండి కానీ..?: డేటింగ్ వార్తలపై రెజీనా

సాయి ధరమ్ తేజ్-రెజీనాల లవ్ స్టోరీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో

సాయి ధరమ్ తేజ్-రెజీనాల లవ్ స్టోరీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో కలిసి నటించిన రెజీనాపై సాయి ధరమ్ తేజ్ మనసు పారేసుకున్నాడట. ఆమె కూడా సాయి అంటే ఇష్టం పెంచుకున్నదట. వీరి ప్రేమ వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య చర్చ జరుగుతున్నట్లు టాక్. 
 
అయితే ఇరుకుటుంబాల పెద్దలు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడే పెళ్లి ఎందుకని అంటోందట రెజీనా. కానీ సాయి మాత్రం ఈ పెళ్లి విషయంలో పట్టుదలగా ఉన్నాడని సమాచారం. ఇండస్ట్రీలో నాగ చైతన్య-సమంతల పెళ్లి తర్వాత జరగబోయే సెలెబ్రిటీ పెళ్లి మాత్రం మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రెజినాలదే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే డేటింగ్, పెళ్లిపై రెజీనా స్పందించింది. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి కథానాయికకు విమర్శలు, అపోహలు తప్పవని రెజీనా అంటోంది. 
 
సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ తిప్పలు తప్పవు. మనల్ని కాదని వదిలేయడమే కరెక్ట్‌ అని తన అభిప్రాయం. మాకూ కుటుంబాలు, ఎమోషన్స్‌ ఉంటాయి. ఫలాన అమ్మాయి ఆ హీరోతో డేటింగ్ చేస్తుందని వస్తున్న వార్తలు వింటే చాలా బాధగా ఉంటుంది. తన గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోనని.. కళ్లారా చూసింది నమ్మండి.. చెవులతో వినడాన్ని నమ్మకండి అంటూ రెజీనా వ్యాఖ్యానించింది.