గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (16:03 IST)

జగన్ మోహన్ రెడ్డి నాకు పిచ్చపిచ్చగా నచ్చేశాడంటున్న హీరోయిన్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని కాంప్లిమెంట్ దక్కింది. ఒకవైపు కేసులు వెంటాడుతున్నా ప్రతిపక్ష నేతగా తానేంటూ నిరూపించుకుంటూ అధికారపార్టీకి కంట్లో నలుసుగా మారిన జగన్ మోహన్ రెడ్డికి ఒక హీరోయిన్ సలాం కొడుతోందని తెలుగు సినీపరిశ్రమ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని కాంప్లిమెంట్ దక్కింది. ఒకవైపు కేసులు వెంటాడుతున్నా ప్రతిపక్ష నేతగా తానేంటూ నిరూపించుకుంటూ అధికారపార్టీకి కంట్లో నలుసుగా మారిన జగన్ మోహన్ రెడ్డికి ఒక హీరోయిన్ సలాం కొడుతోందని తెలుగు సినీపరిశ్రమ కోడై కూస్తోంది. జగన్ గురించి తరచూ టివీల్లో వస్తున్న వార్తలు చూసి ఆ హీరోయిన్ జగన్‌కు అభిమానిగా మారిపోయింది.
 
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పంజాబ్‌లో పుట్టి పుణేలో పెరిగి మోడల్ కమ్ హీరోయిన్ అయిన సునీతా రాణా. జగన్ పైన అభిమానంతో పాటు ప్రేమ పెంచేసుకుంది. అంతటితో ఆగలేదు. తాజాగా మూడురోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది జగన్ మోహన్ రెడ్డిని చూసే తెలుసుకోవాలని చెప్పింది. మొదటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టం. అందుకే రాజకీయాల గురించి న్యూస్ ఛానళ్ళను ఎక్కువగా చూస్తుంటాను. అందులోను తెలుగు ఛానళ్ళను మరీ ఎక్కువగా చూస్తుంటాను అని చెప్పింది.
 
జగన్ పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా జనం లక్షలాదిగా రావడం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. అంతేకాదు ఈమధ్య కాలంలో ఇంతటి పబ్లిక్ ఫిగర్‌ను కూడా చూడలేదని సునీత చెప్పుకొచ్చింది. కేవలం పేద ప్రజల పట్ల జగన్ చూపించే ప్రేమాభిమానాలే అంతటి ఆదరణకు కారణమని చెప్పింది. ఇప్పుడు ప్రజలకు జగన్ లాంటి వ్యక్తే అవసరని చెబుతూ.. ఓటును వేసేటప్పుడు సమర్థుడా కాదా అన్నది ఖచ్చితంగా అందరూ గుర్తించుకోవాలని చెప్పింది. 
 
ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. టివీ ఛానళ్ళ ఇంటర్వ్యూల తరువాత జగన్ గురించి అలా చెప్పిన సునీత ఎవరో తెలుసుకునేందుకు వైసిపి అభిమానులు తెగ ప్రయత్నిం చేస్తున్నారట. అయితే ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అస్సలు స్పందించలేదు.