'ఖైదీ నెంబర్ 150'లో చరణ్!.. మెగాస్టార్ చిత్రానికి హెల్ప్ అవుతుందా?
చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్ ఇటీవల విదేశాల్లో రెండు పాటలను చిత్రీకరించుకుని వచ్చింది. ఇంకోపాటను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస
చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్ ఇటీవల విదేశాల్లో రెండు పాటలను చిత్రీకరించుకుని వచ్చింది. ఇంకోపాటను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేకత ఏమంటే.. ఇందులో రామ్‌చరణ్ కన్పించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో రామ్‌చరణ్ చిత్రాల్లో చిరంజీవి మెరిసినట్లే ఇందులో ఆయన కన్పించనున్నట్లు సమాచారం. ఓ పాటలోని చిన్న బిట్‌లో చిరూతో పాటు చరణ్ కూడా స్టెప్పులు వేయనున్నట్టు చెబుతున్నారు. మరి కొడుకు సినిమాలకు తండ్రి కన్పించినట్లే తండ్రి సినిమాలో కొడుకు కన్పించడంలో ఆశ్చర్యంలేదు. కాకపోతే సినిమాకు ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి.