గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (17:29 IST)

అల్లు అర్జున్‌తోనే తీద్దాం... ప్లీజ్... ప్లీజ్... రాజమౌళిని బతిమాలుతున్న నిర్మాత...

సినీ ఫార్ములా మారుతోంది. బాహుబలి ఇచ్చిన హిట్ దెబ్బకు దర్శకులకు వేల్యూ బాగా పెరిగింది. ముఖ్యంగా రాజమౌళి విషయానికి వస్తే చెప్పలేనంతగా అనుకోవచ్చు. బాహుబలి అంతటి బ్లాక్‌బస్టర్ తీసినప్పటికీ రాజమౌళి మాత్రం ఎప్పటిలానే చాలా మామూలుగా వున్నాడనుకోండి. అదే మరో ద

సినీ ఫార్ములా మారుతోంది. బాహుబలి ఇచ్చిన హిట్ దెబ్బకు దర్శకులకు వేల్యూ బాగా పెరిగింది. ముఖ్యంగా రాజమౌళి విషయానికి వస్తే చెప్పలేనంతగా అనుకోవచ్చు. బాహుబలి అంతటి బ్లాక్‌బస్టర్ తీసినప్పటికీ రాజమౌళి మాత్రం ఎప్పటిలానే చాలా మామూలుగా వున్నాడనుకోండి. అదే మరో దర్శకుడైతే పరిస్థితి వేరేగా వుండేదని టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. సరే... ఇంతటి సామాన్యంగా వుంటున్న రాజమౌళిని టాలీవుడ్ బడా నిర్మాత దానయ్య ఓ విషయం గురించి బ్రతిమాలుతున్నారట. 
 
అదేంటయా అంటే... అల్లు అర్జున్ హీరోగా తన నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించాలని రాజమౌళిని కోరుతున్నారట. ఐతే ఇప్పటికే అల్లు అరవింద్ అంటే తనకు చాలా కోపం అంటూ సెలవిచ్చిన రాజమౌళి దానయ్య మాట వింటారా లేదా అనేది సస్పెన్సుగా మారింది. కానీ దానయ్య మాత్రం అల్లు అర్జున్ హీరోగా పెట్టుకుని సినిమా చేయాలని గట్టి పట్టు పడుతున్నారట.
 
మరోవైపు రాజమౌళి కూడా ఆయన మాటను తీసేయలేని పరిస్థితిలో వున్నాడట. ఎందుకంటే బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించే ముందే రాజమౌళితో దానయ్య డీల్ కుదుర్చుకున్నాడట. డేట్లు కూడా తీసేసుకున్నారట. కాబట్టి రాజమౌళి ప్రస్తుతం దానయ్య మాటను కాదనలేడని అంటున్నారు. అలా అయితే అల్లు అర్జున్ హీరోగా రాజమౌళి చిత్రం చేయాల్సిందే. వేరే ఆఫ్షన్ లేదంటున్నారు. చూడాలి జక్కన్న స్టెప్ ఎలా వుంటుందో...?