శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (12:21 IST)

మణికర్ణికగా మారిపోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నా: కంగనా రనౌత్

దివంగత నటి శ్రీదేవి మృతితో అనారోగ్యం పాలైన బాలీవుడ్ కంగనా రనౌత్.. తాజాగా ''మణికర్ణిక'' సినిమా సంగతులను వెల్లడించింది. ''మణికర్ణిక'' సినిమా ద్వారా తన ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందని కంగనా తె

దివంగత నటి శ్రీదేవి మృతితో అనారోగ్యం పాలైన బాలీవుడ్ కంగనా రనౌత్.. తాజాగా ''మణికర్ణిక'' సినిమా సంగతులను వెల్లడించింది. ''మణికర్ణిక'' సినిమా ద్వారా తన ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందని కంగనా తెలిపింది. ''మణికర్ణిక'' సినిమా షూటింగ్ సమయంలో చాలాసార్లు తాను ప్రమాదాలకు గురయ్యానని చెప్పింది. 
 
పాత్రలో లీనమై ఓ సందర్భంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నానని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. కాగా మణికర్ణిక సినిమాకు జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. 
 
ఝాన్సీరాణిగా కంగనా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఇప్పటికే మణికర్ణికలో తన లుక్‌ను ఇప్పటికే సోషల్ మీడియాలో కంగనా షేర్ చేసింది. ఈ సినిమా కోసం ఖాదీ దుస్తులనే కంగనా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా చేనేత కార్మికులకు తన మద్దతు ఇచ్చేందుకు కంగనా సిద్ధమైనట్లు సమాచారం.