శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (10:58 IST)

టీవీ శాటిలైట్ రైట్స్ : 'ఖైదీ నం.150'ను బీటే చేయలేక పోయిన 'గౌతమిపుత్రశాతకర్ణి'?

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు అంటే.. చిరంజీవి, బాలకృష్ణలు నువ్వానేనా అంటూ జనవరి నెలలో తలపడనున్నారు. వీరిద్దరిలో చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్.150", బాలకృష్ణ చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు అంటే.. చిరంజీవి, బాలకృష్ణలు నువ్వానేనా అంటూ జనవరి నెలలో తలపడనున్నారు. వీరిద్దరిలో చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్.150", బాలకృష్ణ చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి"లు సంక్రాంతి బరిలో ఉండటమే ఈ పోటీకి కారణం. దీంతో టాలీవుడ్‌లో ఓ దశాబ్దకాలం తర్వాత ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. దీనికితోడు ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి. 
 
అయితే, టీవీ శాటిలైట్ రైట్స్ విక్రయంలో మాత్రం బాలకృష్ణ కంటే చిరంజీవి ముందున్నారని చెప్పొచ్చు. చిరంజీవి చిత్రం రూ.10 కోట్లకు అమ్ముడు పోయాయి. చిరంజీవితో వ్యాపార భాగస్వామ్యం కలిగిన ఓ టీపీ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు.. బాలకృష్ణ చిత్రం రూ.9 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఫిల్మ్ నగర్ ట్రేడ్ వర్గాల సమాచారం. చిరంజీవి చిత్రం ఆడియో విడుదల చేయకుండా యూట్యూబ్‌లో పాటలు విడుదల చేస్తారు. కానీ బాలకృష్ణ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, ఆడియో ఈ చారిత్రాత్మక చిత్రంపై అంచనాలు పెంచేశాయి. సోమవారం రిలీజైన శాతకర్ణి పాటలు గల్లీ గల్లీలో మారుమ్రోగుతున్నాయి.
 
అలాగే, భారీ అంచనాల నేపథ్యంలో 'శాతకర్ణి' ప్రీ-రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. ఇప్పటికే రూ.100 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పుకొంటున్నారు. తాజాగా, శాతకర్ణి శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోయినట్టు చెబుతున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ శాతకర్ణి శాటిలైట్ రైట్స్‌ని రూ.9 కోట్లకి సొంతం చేసుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, 'శాతకర్ణి'పై నెలకొన్న క్రేజీ దృష్ట్యా ఈ రేటు చాలా తక్కువని ఫిల్మ్ నగర్‌కు చెందిన వారే అంటుండటం గమనార్హం.