1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (11:38 IST)

నయనతారను మరచిపోలేక పోతున్నా.. ఎందుకంటే.. నందమూరి బాలకృష్ణ

నందమూరి హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి". ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం తిరుపతి పట్టణంలో జరిగింది. ఇందులో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ... 'నయనతార లేకుంటే శ్రీరామరాజ్యం లేదు. హేమమాలిని

నందమూరి హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి". ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం తిరుపతి పట్టణంలో జరిగింది. ఇందులో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ... 'నయనతార లేకుంటే శ్రీరామరాజ్యం లేదు. హేమమాలిని లేకపోతే శాతకర్ణి సినిమా లేదు' అని వ్యాఖ్యానించారు. 
 
ఈ వేదికపై నుంచి బాలకృష్ణ చేసిన కామెంట్స్ చాలామందికి షాక్‌కు గురి చేశాయి. అంటే.. నయనతారను బాలకృష్ణా ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఇదే సందర్భంలో 'శాతకర్ణి' చరిత్రకు సంబంధించిన ఒక ఆశ్చర్యకర విషయాన్ని ఈ ఆడియో ఫంక్షన్‌లో బయటపెట్టారు. 
 
ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ మ్యూజియంలో రెండు గ్యాలరీలు ఉంటే 'ఒకటి గ్రీస్ గ్యాలరీ అయితే మరొకటి అమరావతి గ్యాలరీ' అని అమరావతికి సంబంధించిన చరిత్ర జ్ఞాపకాలు లండన్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రపరిచి ఉన్నాయి అన్న మాటలు చంద్రబాబు నోటివెంట విన్నవారు షాక్ అయ్యారు.
 
చరిత్రలో ఎందరో రాజులు మన భారతదేశాన్ని పరిపాలించినా వారి చరిత్రను లండన్ మ్యూజియంలో నిక్షిప్తం చేయలేదని అటువంటి ఘనత ఒక 'శాతకర్ణి'కే సొంతం అన్న మాటలు ముఖ్యఅతిథి చంద్రబాబు నోటివెంట వచ్చాయి. ఈమాటలు విన్నవెంటనే ఆకార్యక్రమానికి వచ్చిన అతిథులతో పాటు అశేష ప్రజానీకం కూడ తెలుగు జాతి చరిత్రకు సంకేతంగా 'శాతకర్ణి' సినిమా మారబోతోంది అన్న ఊహలలోకి వెళ్ళిపోయారు.