బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (15:30 IST)

జెనీలియా మరో మూడు సార్లు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు- రితేష్ దేశ్‌ముఖ్

బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియాపై ప్రస్తుతం కొత్త వదంతులు వస్తున్నాయి. తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ పాపులారిటీని సాధించిన ముంబై భామ జెనిలియా దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ కుమారుడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న తెలిసిందే. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా 2012 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. రితేష్‌తో ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జెనీలియా జన్మనిచ్చింది. 
 
అయితే సోషల్ మీడియాలో జెనీలియా మూడోసారి గర్భం దాల్చిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా గర్భవతా అని అడిగిన ప్రశ్నకు రితేష్ దిమ్మదిరిగే కామెంట్ చేసాడు. 
 
జెనీలియా మరో రెండు సార్లు, మూడు సార్లు ప్రెగ్నెంట్ అయినా నాకు ఇబ్బంది లేదు. కానీ దురదృష్టం కొద్ది రూమర్లన్నీ అవాస్తవాలే అని రితేష్ హ్యూమర్‌గా జవాబిచ్చాడు.