గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (17:42 IST)

డ్రగ్స్ దందా : ఇన్‌స్టాగ్రామ్‌లో వేదాంతం వల్లించిన ఛార్మీ.. అందరి నోట అదే మాట..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ ఛార్మీ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లోని తన ఖాతాలో ఛార్మీ ఓ పోస్టును పెట్టింది. తన చుట్టూ వుండేవారు హేళన చేస్తూ చ

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ ఛార్మీ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లోని తన ఖాతాలో ఛార్మీ ఓ పోస్టును పెట్టింది. తన చుట్టూ వుండేవారు హేళన చేస్తూ చిన్న బుచ్చినా బాధపడకు. వారలా చేస్తున్నారంటే.. కేవలం నీ ధైర్యాన్ని దెబ్బతీయడానికి మాత్రమే.. వారికన్నా గొప్పగా నువ్వు ఆలోచిస్తున్నావన్న భావన ఉంటేనే ఇలా అవమానిస్తుంటారని ఛార్మీ పోస్ట్ చేసింది. ఈ పోస్టును చూసిన వారంతా డ్రగ్స్ కేసులో తాను నిర్దోషినని ఛార్మీ చెప్పకనే చెప్పిందని నెటిజన్లు అంటున్నారు.
 
టాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. తెలుగు సినీ ప్రముఖుల్లో ఎందరో ఈ దందాలో చిక్కుకున్నారు. కొందరు పోలీసుల నుంచి విచారణకు రావాలని నోటీసులు అందుకున్నారు. ఇప్పటికే టీవీల్లో నోటీసులు పుచ్చుకున్న కొందరి పేర్లు లీక్ అయ్యాయి. మీడియా ముందుకు వచ్చిన వారంతా, డ్రగ్స్ వాడకంతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని, తప్పుగా తమను ఇరికించారని చెప్తున్నారు. విచారణకు కూడా సహకరిస్తామన్నారు. 
 
హీరో నవదీప్, తనీష్, గాయని గీతా మాధురి భర్త నందు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజు తదితరులు ఇదే మాట అన్నారు. వీరిలో చిన్నా మాత్రం తనకు ఇప్పటివరకూ నోటీసులే అందలేదని, తనకు సిగరెట్ అలవాటు కూడా లేదంటున్నారు. మిగిలిన వారు మాత్రం నోటీసులు వచ్చినట్టు స్పష్టం చేశారు. 
 
నవదీప్ మినహా మిగతా వారంతా తమకు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లూ లేవని, అరెస్టయిన కెల్విన్ తదితరులు పరిచయం కూడా లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఛార్మీ వేదాంతం వల్లిస్తూ తనకు డ్రగ్స్‌కు సంబంధం లేనట్లు వ్యాఖ్యానించింది.