శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (12:39 IST)

నటనకు హీరో రవితేజ గుడ్‌బై... డైరక్టర్‌గా అవతారం.. నిజమా?

టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుగడించడమే కాకుండా, చిన్నబడ్జెట్‌తో చిత్రాలు నిర్మించాలని భావించే నిర్మాతలకు కనిపించే తొలి హీరో రవితేజ. ఇలా చిన్న బడ

టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుగడించడమే కాకుండా, చిన్నబడ్జెట్‌తో చిత్రాలు నిర్మించాలని భావించే నిర్మాతలకు కనిపించే తొలి హీరో రవితేజ. ఇలా చిన్న బడ్జెట్‌తో చిత్రాలు నిర్మించి అనేక నిర్మాతలు బడా నిర్మాతలుగా మారారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో రవితేజకు కాలం కలిసిరాలేదు. ఫలితంగా ఆయన నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు వద్ద రెమ్యునరేషన్ విషయంలో పెద్ద వివాదమే జరిగింది. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత రవితేజ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. 
 
అదీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ రెండు చిత్రాలు కూడా గత అనుభవాలనే మిగిలిస్తే ఇక నటనకు స్వస్తి చెప్పి డైరక్టర్‌గా అవతారం ఎత్తాలన్నది రవితేజ ఆలోచనట! రవితేజ మొదట్లో దర్శకత్వ శాఖలో పనిచేసే నటన వైపు వచ్చిన విషయం తెల్సిందే. సో... తనకు పరిచయమున్న దర్శకత్వం వైపు వెడితే కెరీర్‌ గాడిలో పడుతుంది అని రవితేజ ఆలోచన! సో.. రవితేజ మాస్ డైరక్టర్‌గా రాణిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.