శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (15:18 IST)

అమ్మాయితో అడ్డంగా దొరికిన విశాల్

vishal
తమిళ హీరో విశాల్ అడ్డంగా ప్రేయసితో బుక్కయ్యాడు. అచ్చమైన తెలుగు అబ్బాయి అయిన ఇతడు చెన్నైలో సెటిల్ అయి అక్కడే ఎక్కువగా చిత్రాలు చేస్తున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా తన సొంత నిర్మామ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించాడు యంగ్ హీరో.  అభిమానులు అంతా విశాల్ అని పిలుచుకునే ఈయన పూర్తి పేరు విశాల్ కృష్ణా రెడ్డి. 
 
ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ సింగిల్ గానే ఉంటూ ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటున్న ఈయన.. తాజాగా ఓ అమ్మాయితో కలిసి కనిపించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. 
 
హీరో విశాల్ రెడ్ కలర్ హుడీ వేసుకుని ఓ రోడ్డుపై వెళ్తూ కనిపించారు. పక్కేనే ఓ అమ్మాయి కూడా ఉంది. అయితే వాళ్ల రోడ్డుపై వెళ్తుండగా.. ఎవరో గుర్తించడంతో తలపై ఉన్న క్యాప్ వేసుకుని.. ఆమెతో పాటు అక్కడ నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. విశాల్ ప్రస్తుతం హరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. పూర్తి మాస్ యాక్షన్ తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.