శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (13:08 IST)

డ్రగ్స్ రాకెట్‌లో ఆరుగురు బడా సినీ నిర్మాతల సుపుత్రులు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ గుట్టులో ఆరుగురు సినీ ప్రముఖులు అత్యంత కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో డ్రగ్స్‌ కేసు విచారణకు ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ నేరుగా రంగంలోకి దిగ

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ గుట్టులో ఆరుగురు సినీ ప్రముఖులు అత్యంత కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో డ్రగ్స్‌ కేసు విచారణకు ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ నేరుగా రంగంలోకి దిగనున్నట్లు తెలిసింది. 
 
డ్రగ్స్ ప్రధాన సూత్రధారి కెల్విన్‌ను తానే స్వయంగా విచారించి అనేక సందేహాలకు సమాధానం రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం, మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే వాటిని సిద్ధం చేసినా.. కొన్ని అంశాలు నిర్ధారణ కావాల్సి ఉందని సమాచారం. ఆ ఆరుగురి పేర్లూ సినీ పరిశ్రమనే కిర్రాక్‌ పెట్టిస్తాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టాలీవుడ్‌కే మూల స్తంభాల్లాంటి ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది.
 
ఓ ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడు, మరో ఫైట్‌ మాస్టర్‌ కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కెల్విన్‌ కేసులోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 67ను ప్రయోగించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఓ వ్యక్తి పక్కాగా డ్రగ్స్‌ వాడుతున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవడానికి నోటీసులు ఇచ్చి పిలుస్తారు. 
 
విచారణలో చెప్పే అంశాలను, తమ వద్ద ఉన్న సమాచారాన్ని బేరీజు వేసుకొని పొంతన కుదురుతోందా? లేదా అన్నది పరిశీలిస్తారు. ఆ తర్వాతే అసలు సినిమా ఉంటుంది. పక్కా ఆధారాలుంటే వెంటనే అరెస్ట్‌ చేయవచ్చు. లేదా తగిన సాక్ష్యాధారాలు సేకరించాక చర్యలు తీసుకోవచ్చు. కానీ, డ్రగ్స్‌ విక్రయుంచే వారి విషయంలో ఈ మినహాయింపులు ఉండవు.
 
మరోవైపు... విచారణ పూర్తి అయిన తరువాత మరో ఆరుగురికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఆరుగురి పేర్లూ బయటకు వస్తే, తెలుగు సినీ ఇండస్ట్రీ కంపిస్తుందని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీసి, దశాబ్దాలుగా చిత్ర నిర్మాణ రంగంలో ఉన్న నిర్మాతల వారసులు ఈ ఆరుగురిలో ఉన్నట్టుగా శనివారమే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
వారి పేర్లపై లీకులు వచ్చినప్పటికీ, అధికారికంగా పేర్లు వెల్లడి కాలేదు. మరోవైపు తమ కుటుంబంలోని రానా, అభిరామ్‌లను రచ్చకీడ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మాత దగ్గుబాటి సురేష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి కుటుంబం స్థాయిలోనే తెలుగు పరిశ్రమకు మూలస్తంభంగా ఉన్న మరో కుటుంబంలోని హీరో సోదరుడి పేరు కూడా ఈ జాబితాలో ఉందని, వారి పేర్లు బయటకు వస్తే సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు ఉంటాయని సిట్ వర్గాలు చెబుతున్నాయి.