ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (10:43 IST)

తమిళ 'కత్తి'ని నేనొద్దంటే చిరంజీవి చేశారు... రీమేక్‌లు ఇష్టముండదు : మహేష్ బాబు

రీమేక్ మూవీలపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ నటులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే చిరంజీవి తన 150వ చిత్రాన్ని తమిళ చిత్రం కత్తి

రీమేక్ మూవీలపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ నటులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే చిరంజీవి తన 150వ చిత్రాన్ని తమిళ చిత్రం కత్తిని ఆధారంగా చేసుకుని ఖైదీ నంబర్ 150 పేరుతో రీమేక్ చేశారు. ఇది సూపర్ హిట్ కొట్టేసింది. అలాగే, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా పలు తమిళ చిత్రాల ఆధారంగా తన చిత్రాలను నిర్మించారు.
 
అయితే, ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం రీమేక్‌లపై ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. దీనిపై మహేష్ స్పందిస్తూ.. ఒక సినిమాను చూసి, మళ్లీ అదే కథలో నటించడమంటే తనకు ఏమాత్రం ఉత్సాహం ఉండదని చెప్పాడు. అందుకే, రీమేక్‌లు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. షూటింగ్‌కు వెళ్తే అంతా కొత్తగా అనిపించాలని... అప్పుడే మనం చేస్తున్న పనిపై మనకు ఆసక్తి ఉంటుందని చెప్పాడు. 
 
రెండు, మూడు రీమేక్ సినిమాలు తన వద్దకు వచ్చినా, తిరస్కరించానని చెప్పాడు. 'కత్తి' (తెలుగులో ఖైదీ నంబర్ 150) రీమేక్ కూడా తొలుత తన వద్దకే వచ్చిందని... అయితే ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తేనే చేస్తానని చెప్పానని... అప్పుడు ఆయన హిందీలో బిజీగా ఉండటం వల్ల వీలుపడలేదని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.