శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: ఆదివారం, 13 ఆగస్టు 2017 (14:18 IST)

రానా దానికి పనికిరాడనుకున్నా.. ఎవరు..?

ఒకప్పుడు దర్శకుడు తేజ సినిమాలంటే యువ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. జయం సినిమా తరువాత తేజకు అంత పెద్దస్థాయిలో క్రేజ్ వచ్చింది. ఆ తరువాత తీసిన సినిమాలు మూస పద్ధతిలో ఉండటంతో తేజ సినిమాలకు దూరమైపోయాడు. సినిమాలకు దర్శకత్వం వహించడమే మానేశాడు.

ఒకప్పుడు దర్శకుడు తేజ సినిమాలంటే యువ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. జయం సినిమా తరువాత తేజకు అంత పెద్దస్థాయిలో క్రేజ్ వచ్చింది. ఆ తరువాత తీసిన సినిమాలు మూస పద్ధతిలో ఉండటంతో తేజ సినిమాలకు దూరమైపోయాడు. సినిమాలకు దర్శకత్వం వహించడమే మానేశాడు. మానేశాడు అనేదాని కన్నా నిర్మాతలెవరూ అవకాశమివ్వలేదు అన్నది కరెక్టేమో. అయితే చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత రానాతో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాకు దర్శకత్వం వహించారు తేజ.
 
పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో నడిచే ఈ సినిమాకు ముందుగా వేరే హీరోను ఎంచుకుని చివరకు రానాతో సరిపుచ్చుకున్నారు తేజ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పడం ప్రస్తుతం తెలుగు సినీరంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నేను తీసే సినిమాలో భార్యతో ప్రేమగా ఉండాలి.. అదే సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. అందులోను కాజల్ లాంటి అందాల నటితో కలిసి పనిచేయాలి. అది రానాకు సాధ్యమా అని ముందు ఆలోచించాం. గతంలో రానా, జెనీలియా నటించిన ప్రేమ సినిమా కాస్త అట్టర్ ఫ్లాపయ్యింది. అందుకే రానా పనికిరాడోమో.. అనవసరంగా ఇతన్ని ఎంచుకున్నాను అనుకున్నారట..
 
కానీ సినిమా షూటింగ్ సమయంలో రానా కాజల్‌తో కలిసి పండించిన ఆ సీన్లు తేజను బాగా నచ్చాయట. సినిమా అంతా అయిపోయిన తరువాత రానా బాగా చేశావంటూ తేజ మెచ్చుకున్నారట.