ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (14:52 IST)

అబ్బే లవ్వులు-గివ్వులు నాకు సెట్ కావు... పెద్దల కుదిర్చిన పెళ్ళే.. సమంతలా?: కాజల్

లవ్వులు తనకు ఏమాత్రం పనిచేయవని చందమామ కాజల్ అంటోంది. ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా పేరుతెచ్చుకుని చైతూ ప్రేమలో పడి వివాహం చేసుకుంటున్న సమంతలా ప్రేమ తనకు సెట్ కాదని కాజల్ అగర్వాల్ అంటోంది. తాను మాత్రం పెద

లవ్వులు తనకు ఏమాత్రం పనిచేయవని చందమామ కాజల్ అంటోంది. ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా పేరుతెచ్చుకుని చైతూ ప్రేమలో పడి వివాహం చేసుకుంటున్న సమంతలా ప్రేమ తనకు సెట్ కాదని కాజల్ అగర్వాల్ అంటోంది. తాను మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని గట్టిగా చెప్తోంది. దక్షిణాది అగ్ర హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కెరీర్ సాగిస్తూనే ఐటమ్ గర్ల్‌గా మారిపోయింది.
 
అమ్మడు కెరీర్ అంతేనా అనుకునేలోపే అనూహ్యంగా కెరీర్ మారింది. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీతో అమ్మడుకు సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఇప్పటివరకు తాను ప్రేమలో పడలేదని.. తన పెళ్లికి ఇప్పుడంత అవసరం లేదని ఇంకా టైమ్ ఉందని చెప్తోంది. ఇంకేముంది..? కాజల్‌ లవ్ మ్యారేజ్‌ను ఎందుకు అంత వ్యతిరేకిస్తుందోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రేమలో ఆమె విఫలం అయ్యిందా అంటూ మాట్లాడుకుంటున్నారు.