ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 22 ఫిబ్రవరి 2018 (13:37 IST)

కమెడియన్‌తో పీకల్లోతు ప్రేమలో హాట్ భామ.. ఎవరు?

అంతకుముందు ఆ తరువాత, దర్శకుడు, అమీతుమీ, అ సినిమాలు చూశారా.. ఆ సినిమాలలో నటించిన ఇషా రెబ్బా గుర్తుందా.. అమాయకంగా కనిపించే క్యారెక్టర్ ఆమెది. ఏ సినిమాలో నటించినా ఆమెకు మంచి గుర్తింపే వస్తోంది. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా నాని నిర్మాతగా మారి

అంతకుముందు ఆ తరువాత, దర్శకుడు, అమీతుమీ, అ సినిమాలు చూశారా.. ఆ సినిమాలలో నటించిన ఇషా రెబ్బా గుర్తుందా.. అమాయకంగా కనిపించే క్యారెక్టర్ ఆమెది. ఏ సినిమాలో నటించినా ఆమెకు మంచి గుర్తింపే వస్తోంది. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా నాని నిర్మాతగా మారిన అ సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్రను పోషించింది ఇషా రెబ్బా. అయితే ఇప్పుడు ఒక కమెడియన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందట. అతనెవరో తెలుసా.. అవసరాల శ్రీనివాస్.
 
ఈ పేరు వింటే అష్టాచమ్మా సినిమా గుర్తుకు వస్తుంది కదా. కమెడియన్, హీరోగానే కాదు.. అవసరాల శ్రీనివాస్ మంచి రచయిత, దర్శకుడు కూడా. అ సినిమాలో నటించే సమయంలో అవసరాల శ్రీనివాస్‌కు, ఇషా రెబ్బాకు మధ్య పరిచయం బాగా పెరిగిందట. ఆ పరిచయం కాస్త ఇప్పుడు ప్రేమకు దారితీసిందని సినీపరిశ్రమలోని వారు చెబుతున్నారు. ఇద్దరూ ఎంచక్కా రెస్టారెంట్లకు, పార్కులకు తెగ తిరిగేస్తున్నారట. 
 
అవసరాల యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. అతడితో కలిసి అ సినిమాలో నటించడం ఇంకా సంతోషంగా ఉందని చెబుతోంది హాట్ భామ ఇషా రెబ్బా. అయితే ప్రేమ విషయాన్ని మాత్రం ఇద్దరూ రహస్యంగానే ఉంచుతున్నారు. వీరి ప్రేమ పెళ్ళిపీటలకు వరకు వెళుతుందా.. లేక మధ్యలోనే ఆగిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.