ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (14:39 IST)

ఫిదా భామ సాయిపల్లవిలో ఉన్న చెడుగుణం ఇదే!

సాయిపల్లవి. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయిన సాయిపల్లవి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతోనే తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి పల్లవికి.

సాయిపల్లవి. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయిన సాయిపల్లవి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతోనే తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి పల్లవికి. అంతేకాదు ఏకంగా అగ్రనటులతోనే నటించే అవకాశం లభించింది. తమిళంలో సూర్య సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది సాయిపల్లవి.
 
తనకు ఇష్టమైన నటుడు సూర్య. ఆయన సినిమాలో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని, సూర్యను తాను ఎంతగానో అభిమానిస్తానని సాయిపల్లవి పలు ఇంటర్వ్యూలలో చెప్పింది కూడా. అలాంటి సాయిపల్లవికి ఒక చెడ్డ అలవాటు ఉందని తెలుగు, తమిళ సినీపరిశ్రమలోని వారు కోడై కూస్తున్నారు. 
 
అదేంటంటే సాయిపల్లవి షూటింగ్ సమయానికి ఎప్పుడూ రాదట. షూటింగ్ ప్రారంభమైన చాలా సేపటికి వస్తుందట. చెప్పిన సమయాన్ని అస్సలు పాటించదని పరిశ్రమలోని వారు చెవులు కొరుక్కుంటున్నారు. అగ్రనటుడు సూర్యానే సరైన సమయానికి షూటింగ్‌కు వస్తే సాయిపల్లవి మాత్రం ఆయన్నే వెయిట్ చేయిస్తుందట. ఇప్పటివరకు సమయానికి రాలేదని ఆ సినిమా డైరెక్టర్ చాలా కోపంగా ఉన్నారట.