సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (14:48 IST)

కుమ్మేస్తున్న ఎంసీఏ కలెక్షన్లు: ఎనిమిది రోజుల్లో రూ.30కోట్లు?

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ప్రేక్షకులను విభిన్న కథలతో ఆకట్టుకునే సినిమా చేస్తున్న నాని తాజాగా "మిడిల్ క్లాస్ అబ్బాయ్"తో అదరగొట్టాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ప్రేక్షకులను విభిన్న కథలతో ఆకట్టుకునే సినిమా చేస్తున్న నాని తాజాగా "మిడిల్ క్లాస్ అబ్బాయ్"తో అదరగొట్టాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని చేసిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజున విభిన్న అభిప్రాయాలు వచ్చినా.. చివరికి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్‌లోనే రూ.18కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇంకా ఈ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఎనిమిది రోజుల్లో నాని ఎంసీఏ రూ.30 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని సమాచారం. నాని, సాయిపల్లవి, భూమిక కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.