గురువారం, 14 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (10:36 IST)

''సాయిపల్లవి'' అనే పేరు ఎలా వచ్చిందంటే..? ఫిదా హీరోయిన్

డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని.. పన్నెండో తరగతి పూర్తయ్యాక ఈటీవీ డ్యాన్స్ షోకి దరఖాస్తు చేసుకుంటే ఎంపికయ్యానని ఫిదా హీరోయిన్ సాయిపల్లవి వెల్లడించింది. తన తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలని, అందుకే, తన ప

డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని.. పన్నెండో తరగతి పూర్తయ్యాక ఈటీవీ డ్యాన్స్ షోకి దరఖాస్తు చేసుకుంటే ఎంపికయ్యానని ఫిదా హీరోయిన్ సాయిపల్లవి వెల్లడించింది. తన తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలని, అందుకే, తన పేరు మొదట్లో ఈ పదాన్ని కలిపి ''సాయి పల్లవి'' పేరు పెట్టారని చెప్పింది. తాను, తన చెల్లెలు పూజ కవల పిల్లలమని.. సాయిపల్లవి వెల్లడించింది. 
 
ఎంసీఏ మూవీ హిట్ టాక్‌ను సంపాదించుకున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లోని కోటగిరి దగ్గర ఓ కుగ్రామం తమదని తెలిపింది. తన తల్లిదండ్రులు రాధామణి, సెందామరై అని చెప్పింది. తన తల్లి గృహిణి కాగా, తండ్రి కస్టమ్స్ ఆఫీసర్ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
 
కాగా ఫిదాతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ''క‌ణం'' ద్వారా ఫిబ్రవరి 9న ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో సూర్య ఓ సినిమా చేసే చిత్రంలోనూ నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే ఓ క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎంపిక‌వ‌గా.. మ‌రో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి కూడా ఎంపికైంది.