మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi

'ఫిదా' బ్యూటీతో మిడిల్ క్లాస్ అబ్బాయి రొమాన్స్ (వీడియో)

'ఫిద్యా' బ్యూటీతో "మిడిల్ క్లాస్ అబ్బాయి" చేసిన రొమాన్స్ అదిరిపోయింది. సాయి పల్లవి, నాని కాంబినేషన్‌లో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈనెల 21వన తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్ర ఆడ

'ఫిద్యా' బ్యూటీతో "మిడిల్ క్లాస్ అబ్బాయి" చేసిన రొమాన్స్ అదిరిపోయింది. సాయి పల్లవి, నాని కాంబినేషన్‌లో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈనెల 21వన తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్ర ఆడియో వేడుక సాయంత్రం వ‌రంగల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. 
 
ఫంక్ష‌న్‌లో దేవీశ్రీ ప్ర‌సాద్ మ‌రోసారి త‌న ఎనర్జీతో ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేశాడు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ వినూత్న ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. సినిమాకు సంబంధించిన ప‌లు సాంగ్స్ విడుద‌ల చేస్తున్న టీం ఆడియో వేడుక‌లో భాగంగా కొత్త కొత్త‌గా అనే వీడియో సాంగ్ ప్రోమోని విడుద‌ల చేసింది. 
 
వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు స‌మాచారం.