గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (12:09 IST)

మిడిల్ క్లాస్ అబ్బాయిలో డిలీట్ చేసిన సీన్లు ఇవే (వీడియో)

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). భూమిక, ఆమని, సీనియర్ నరేష్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు.

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). భూమిక, ఆమని, సీనియర్ నరేష్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ చిత్రం విడుదలైన మొదటి అట నుంచి హిట్ ట్రాక్‌తో దూసుకెళుతోంది. 
 
అయితే, ముఖ్యంగా, విడుదలైన తొలి రోజు నుంచి ఇప్పటివరకు నిలకడగా కలెక్షన్లు సాధిస్తూ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. విడుదలైన అన్ని సెంటర్స్ లో ఎంసీఏ చిత్రం మంచి ఆదరణ పొందుతుంది. తాజాగా చిత్ర యూనిట్ ఎంసీఏ చిత్రంలోని డిలీట్ సీన్‌ని విడుదల చేసింది. నిమిషానికి పైగా ఉన్న ఈ వీడియో నాని అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఎంసీఏ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.