మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (11:03 IST)

2018లో డేట్స్ లేవ్.. కావాలంటే అడిగినంత ఇచ్చి బుక్ చేసుకోండి : సాయి పల్లవి

గత యేడాది బాగా అచ్చొచ్చిన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. కేరళకు చెందిన ఈ భామ "ఫిదా" చిత్రంతో తెలుగింటి పిల్లలా మారిపోయింది. ఈ చిత్రంలోని తన నటనతో పాటు తెలంగాణ యాస,

గత యేడాది బాగా అచ్చొచ్చిన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. కేరళకు చెందిన ఈ భామ "ఫిదా" చిత్రంతో తెలుగింటి పిల్లలా మారిపోయింది. ఈ చిత్రంలోని తన నటనతో పాటు తెలంగాణ యాస, భాషల్లో మాట్లాడి ప్రేక్షకుడిని ఇట్టే కట్టిపడేసింది. ఆ తర్వాత 2017 ఆఖరులో వచ్చిన చిత్రం "ఎంసీఏ" (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ చిత్రం కూడా మంచి హిట్ సాధించడంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
 
"దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల"న్న నానుడిని అక్షరాలా ఫాలో అవుతోందట. ఫలితంగా ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 'ఎంసీఏ' కూడా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం సాయి పల్లవికి డిమాండ్ అమాంతం పెరిగిపోయిందని సమాచారం.
 
ఆమె డేట్స్ కోసం పెద్ద సంస్థలు సైతం ప్రయత్నిస్తున్నాయని, సాయి పల్లవి డేట్స్ క్యాలెండర్‌లో ఈ సంవత్సరం ఖాళీ లేదని తెలుస్తోంది. పోనీ 2019లోనైనా ఆమె డేట్స్ తీసుకోవాలని కొందరు ప్రముఖ నిర్మాతలు సాయి పల్లవిని సంప్రదిస్తే, రెమ్యునరేషన్‌గా వారు ఊహించని మొత్తాన్ని డిమాండ్ చేస్తోందట. దీంతో అవాక్కైన నిర్మాతలు వెనుదిరిగారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.