1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (09:35 IST)

నాన్నకు ప్రేమతో... జూనియర్ ఎన్టీఆర్‌కు ఆప్యాయంగా ముద్దుపెట్టిన హరికృష్ణ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందిన ''ఇజమ్'' సినిమా ఆడియో వేడుక బుధవారం హైదరాబాదులో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ కార్యక్రమంలో నందమ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందిన ''ఇజమ్'' సినిమా ఆడియో వేడుక బుధవారం హైదరాబాదులో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ కార్యక్రమంలో నందమూరి హరికృష్ణ, తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వచ్చేటప్పటికే నందమూరి హరికృష్ణ అక్కడికి చేరుకున్నారు. 
 
ఈ ఆడియో వేడుకలో మాట్లాడిన హరికృష్ణ.. తన ఇద్దరు కొడుకులు సినిమాల హిట్స్ రూపంలో తనకు బహమతులు ఇస్తున్నారని, కల్యాణ్ రామ్ ''పటాసు'', జూనియర్ ఎన్టీఆర్ ''టెంపర్'', ''జనతా గ్యారేజ్''.. హిట్స్ రూపంలో తనకు బహుమతులు ఇస్తున్నారని. ఇప్పుడు ''ఇజమ్''చిత్రం కూడా మరో హిట్ కాబోతుందని హరికృష్ణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకలో కోసం తమ్మున్ని ప్రమోట్ చేసి, హిట్‌తో గట్టెక్కించడానికి యంగ్ టైగర్ వచ్చాడు. 
 
అయితే ఈ ఫంక్షన్‌లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. పుల్ గడ్డంతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్.. రావటంతోనే ప్రకాష్ రాజ్‌ను గట్టిగా కౌగిలించుకుని ముందుకు వెళ్లాడు. ఎన్టీఆర్ తండ్రిని అప్యాయంగా అల్లుకున్నాడు. తండ్రి కాళ్లు పట్టుకుని వంగి ఏం మాట్లాడాడో తెలియదు కానీ, హరికృష్ణ ఆ వెంటనే.. ఎన్టీఆర్ చెంపలు పట్టుకుని ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది.