జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ.. పేరు 'సమసమాజ్ పార్టీ'
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పేరు సమసమాజ్. ఈ పార్టీ అధినేతగా ఆయనే కొనసాగనున్నారు. ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలోనేకాకుండా రాజకీయాల్లో సైతం పెద్ద చర్చనీయాంశంగా మా
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పేరు సమసమాజ్. ఈ పార్టీ అధినేతగా ఆయనే కొనసాగనున్నారు. ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలోనేకాకుండా రాజకీయాల్లో సైతం పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. 'బిగ్ బాస్'షోతో బుల్లితెర మీద హల్‌చల్ చేస్తున్నారు. మరోవైపు ‘జై లవకుశ’ సినిమా పనులతో కూడా బిజీగా ఉన్నాడు. బాబి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీయార్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీయార్ పోషిస్తున్న ‘జై’ క్యారెక్టర్ గురించిన టీజర్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీయార్ రాజకీయనాయకుడిగా కూడా కనిపించబోతున్నాడట. ‘సమసమాజ్’ పార్టీ నేతగా ఎన్టీయార్ కనిపించనున్నాడట. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
సమసమాజ్' పార్టీ జెండాలు, వాటి మీద ఎన్టీయార్ బొమ్మలు ఉన్న ఫోటలు వర్కింగ్ స్టిల్స్‌గా బయటకు వచ్చాయి. అయితే ఆ జెండాలపై పేరు ఇంగ్లీష్, హిందీ బాషల్లో ఉండడంతో.. ఎన్టీయార్ ఉత్తరాదికి చెందిన రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.