సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 మార్చి 2017 (18:56 IST)

నిజమే... నేను కూడా ఆ విషయంలో వారితో రాజీ పడ్డా... కాజల్ అగర్వాల్

టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్లు ఓ దుమ్ము దులిపేసేట్లుగా వున్నారు. ఆమధ్య మాధవీలత, అంతకుముందు రాధికా ఆప్టే ఇలా వరుసగా తమను కొందరు ఛాన్సులివ్వాలంటే కాంప్రమైజ్ కావాలని కోరారని సంచలన ఆరోపణలు చేశారు. ఈమధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో లైం

టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్లు ఓ దుమ్ము దులిపేసేట్లుగా వున్నారు. ఆమధ్య మాధవీలత, అంతకుముందు రాధికా ఆప్టే ఇలా వరుసగా తమను కొందరు ఛాన్సులివ్వాలంటే కాంప్రమైజ్ కావాలని కోరారని సంచలన ఆరోపణలు చేశారు. ఈమధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల మాట విన్నాననీ, ఐతే తనకు మాత్రం ఎదురవలేదని చెప్పింది.
 
కాజల్ అగర్వాల్ తాజాగా దీని గురించి స్పందిస్తూ... లైంగిక వేధింపుల సంగతేమో నాకు తెలియదు కానీ, ఇండస్ట్రీలోకి కాలు పెట్టిన మొదట్లో ఆ విషయాల్లో నేను రాజీ పడాల్సి వచ్చింది. నటించే మొదట్లో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. ముఖ్యంగా గ్లామర్ అందాలను ఆరబోయడం, మితిమీరి ఎక్స్ పోజింగ్ చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు నాకు ఇష్టం లేకపోయినా ఇలా చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో వాటిని తలుచుకుని కుమిలిపోయేదాన్ని. కానీ ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే అవన్నీ పడాల్సిందేనని తర్వాత అర్థమైందని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.