అప్పట్లో తప్పుచేసిందట.... ఇప్పుడు కుర్రహీరోలకు రూ.1.5 కోట్లు, చిరంజీవికైతే రూ.1.75 కోట్లట... కాజల్ కహానీ
మగధీర చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అందాల భామ కాజల్ అగర్వాల్. తాజాగా మగధీర రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో ఖైదీ నెం. 150లో నటించింది. ఈ చిత్రం ఇప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ కి మంచి స్టార్టప్ ఇచ్చింది. ఈ చిత్రం విజయ
మగధీర చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అందాల భామ కాజల్ అగర్వాల్. తాజాగా మగధీర రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో ఖైదీ నెం. 150లో నటించింది. ఈ చిత్రం ఇప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ కి మంచి స్టార్టప్ ఇచ్చింది. ఈ చిత్రం విజయవంతం కావడంపై చిరంజీవి ఎంతగా ఆనందపడిపోతున్నారో కాజల్ అగర్వాల్ కూడా అంతే ఆనందపడుతోందట. చిత్రం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెపుతోందట.
మరోవైపు తాజాగా తన రెమ్యునరేషన్ పెంచేసిందట. ఇంతకీ ఆమె రెమ్యునరేషన్ వ్యవహారం చూస్తే, కుర్ర హీరోలకైతే రూ. 1.5 కోట్లు తీసుకుంటోందట. చిరంజీవి చిత్రం ఖైదీ నెం.150లో నటించినందుకు రూ. 1.75 కోట్లు తీసుకున్నదట. ఎందుకంటే చిరంజీవి కాస్త వృద్ధ హీరో కదా అనే భావనతో అలా చెప్పినట్లు తెలుస్తోంది.
చిరంజీవితో నటించినట్లే తమ వృద్ధ హీరోతో కూడా నటించమని ఓ నిర్మాత అడిగితే... చిరుకైతే రూ.1.75 తీసుకున్నాను... ఆ వృద్ధ హీరోకైతే రూ. 2 కోట్లు కావాలని డిమాండ్ చేసిందట. దాంతో సదరు నిర్మాత మరో మాట మాట్లాడకుండా అక్కడ నుంచి చెక్కేశాడట. ఇంతకీ ఆ వృద్ధ హీరో ఎవరో మరి?