బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 7 జూన్ 2017 (16:05 IST)

తమన్నా దానికి ఒప్పుకోలేదట... కాజల్ అగర్వాల్ అడ్జెస్ట్ అవుతానంటోందట...

సినిమాల్లో అవకాశాలు ఒకరివి ఇంకొకరు తన్నుకెళ్లడం మనకు తెలిసిందే. ఇలా ఒకరి ఛాన్సులు మరొకరు చేజిక్కించుకున్నవి చాలానే వున్నాయి. ఐతే చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం కొందరు చేస్తుంటారు. ఇలాంటివారిలో తమన్నా కూడా చేరిపోయిందంటున్నారు. బాహుబలి మబ్బులో

సినిమాల్లో అవకాశాలు ఒకరివి ఇంకొకరు తన్నుకెళ్లడం మనకు తెలిసిందే. ఇలా ఒకరి ఛాన్సులు మరొకరు చేజిక్కించుకున్నవి చాలానే వున్నాయి. ఐతే చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం కొందరు చేస్తుంటారు. ఇలాంటివారిలో తమన్నా కూడా చేరిపోయిందంటున్నారు. బాహుబలి మబ్బులో తేలిపోతున్న తమన్నాను ఎవరు కదిలించినా కోట్ల రూపాయల పారితోషికం అడుగుతోందట. 
 
అదేమని అడిగితే బాహుబలి అవంతికి సన్నివేశాలు చూపిస్తోందట. మరీ ఇంతగా మబ్బులో వుంటే దించడం ఎవరికి సాధ్యం. అలాగే తమిళ నిర్మాత కూడా ఆమె అడిగినంత ఇచ్చుకోలేక జారుకున్నాడట. బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్న త్యాగరాజన్, చిత్రంలో నటించేందుకు తమన్నాను కలిస్తే ఆమె చెప్పిన పారితోషికం విని చుక్కలు కనిపించాయట. దాంతో ఇక లాభం లేదనుకుని కాజల్ అగర్వాల్‌ను సంప్రదించాడట. 
 
ఆయన చెప్పిన పారితోషికానికి కాజల్ అడ్జెస్ట్ అయ్యేందుకు అంగీకారం తెలిపినట్లు కోలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. ఐతే ఇది ఇంకా ఫైనల్ కావాల్సి వుంది.