బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 20 జులై 2017 (16:18 IST)

ఆ సిల్లీ పాయింట్ పైన కత్రినా కైఫ్ వెరీ యాంగ్రీ... చెబితే నవ్వుకుంటారు...

కత్రినా కైఫ్ మల్లీశ్వరి చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవలే 33వ ఏటలో అడుగుపెట్టిన కత్రినా కైఫ్ ను ఓ పిల్ల జర్నలిస్ట్ ఓ ప్రశ్న వేసి ఆమె ఆగ్రహానికి గురయ్యాడట. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటయా... అంటే, హలో మిస్... మీరు పెళ్లెప్పుడు చేస్కుంటారని అడ

కత్రినా కైఫ్ మల్లీశ్వరి చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవలే 33వ ఏటలో అడుగుపెట్టిన కత్రినా కైఫ్ ను ఓ పిల్ల జర్నలిస్ట్ ఓ ప్రశ్న వేసి ఆమె ఆగ్రహానికి గురయ్యాడట. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటయా... అంటే, హలో మిస్... మీరు పెళ్లెప్పుడు చేస్కుంటారని అడిగాడట. అంతే... కైఫ్ అంతెత్తున ఎగిరి నాకు నేషనల్ అవార్డ్ వచ్చాక... ఏం నీకేంటి అంత తొందర అంటూ సెటైర్లు వేసిందట. 
 
ఇకపోతే తనకు 33 ఏళ్లొచ్చినా ఇంకా చిన్నదానిలానే ఫీలవుతున్నానని చెప్పిన కత్రినా కైఫ్ పెళ్లి గురించి తనకేం తొందరలేదని తేల్చి చెప్పిందట. ఇంకా సదరు పిల్ల జర్నలిస్టు వైపు చూస్తూ... ఇంకా నా గురించి నీకు అవగాహన అయినట్లు లేదు కానీ... నాకంటే సీనియర్లను(పెళ్లికాని హీరోయిన్లు) కలిసి ఇదే విషయం అడుగు. వాళ్లు చెప్తారు నీకు అంటూ గుడ్లు ఉరిమి చూసిందట. దాంతో సదరు పిల్ల జర్నలిస్టుకు కారిపోయాయట చెమట్లు.