పవన్ కోసం ఏమైనా చేస్తా : డిస్కౌంట్ ఏంటి ఖర్మ... ఏదైనా ఇస్తానంటున్న ఆ హీరోయిన్?
టాలీవుడ్ అగ్రహీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయనతో కలిసి నటించేందుకు అనేక మంది హీరోయిన్లు పోటీపడుతుంటారు. ముఖ్యంగా.. కుర్రకారు నటీమణులు సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, పవన్ సరస
టాలీవుడ్ అగ్రహీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయనతో కలిసి నటించేందుకు అనేక మంది హీరోయిన్లు పోటీపడుతుంటారు. ముఖ్యంగా.. కుర్రకారు నటీమణులు సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్... ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇప్పుడే మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. దీనిపై వారిద్దరు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వీరిలో కీర్తి మాత్రం ఓ అడుగు ముందుకేసి... తన పారితోషికం కూడా తగ్గించుకుందట. తెలుగులో ఓ సినిమాకు దాదాపు కోటిన్నర తీసుకుంటున్న మలయాళి కుట్టి.. ఈ సినిమా కోసం భారీగా డిస్కౌంట్ ఇచ్చిందట. పవన్ సినిమాలో నటించే హీరోయిన్‌కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేస్తుందని ఫిల్మ్‌నగర్ సెంటిమెంట్.
గతంలో కీర్తి రెడ్డి, భూమిక, శృతీహాసన్ వంటి హీరోయిన్లు పవన్‌తో నటించిన తర్వాతే గుర్తింపు పొందారన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాను కూడా చేరాలనుకుంటోందట కీర్తి. పైగా ఈ సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్. వీరి కాంబినేషన్‌లో గతంలో సెన్సేషనల్ హిట్స్ వచ్చాయనే విషయం తెలిసిందే. అందుకే తన పారితోషికాన్ని తగ్గించుకుని ఈ చిత్రంలో నటించేందుకు సమ్మతించిందట.