ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (15:32 IST)

చిరంజీవిని విపరీతంగా వాడేసుకుంటున్న చెర్రీ... ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ చిత్రం ''ఖైదీ నంబ‌ర్ 150''. వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌లో అందాల తార‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చిరంజ

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ చిత్రం ''ఖైదీ నంబ‌ర్ 150''. వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌లో అందాల తార‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చిరంజీవి కుమారుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సొంత బ్యాన‌ర్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న రావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తి అయిన ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. కాగా ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇటీవల రిలీజైన భారీ చిత్రాలకి తీసిపోని రేట్లకి ఈ చిత్రం బిజినెస్‌ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న బిజినెస్‌ ఆధారంగా చూస్తే, కనీసం రూ.80 కోట్ల వరకు ఈ చిత్రం అమ్ముడయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాత రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని భారీ రేట్లకి అమ్మేస్తున్నాడు.
 
ఆఫర్లు వస్తున్నాయి కదా అన్నట్టు విపరీతంగా బిజినెస్ చేసేస్తున్నాడు. వైజాగ్‌ ఏరియాలో దీనికి ఎనిమిది కోట్లకి పైగా చెల్లించారట. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ ఏరియాకి సంబంధించి ఇది అతి పెద్ద మొత్తం ఇదేనని సమాచారం. వచ్చిన రేట్లకి వచ్చినట్టే అమ్మేస్తే, రేపు సినిమా అంచనాలకి తగ్గట్టు లేకపోతే పరిస్థితి ఏమవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఈ సినిమాను క్యాష్‌ చేసేసుకోవడం పట్ల కొందరు సీనియర్‌ అభిమానులు సైతం నసుక్కుంటున్నారు. మరి బిజినెస్‌కి తగ్గట్టుగా ఈ సినిమా హిట్టవుతుందో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచియుండాల్సిందే.