'అంజనీపుత్ర' క్రిష్ దర్శకత్వంలో రామ్ చరణ్... పేరేంటో తెలుసా?
అంజనీపుత్ర క్రిష్ అలియాస్ జాగర్లమూడి క్రిష్. చేసింది నాలుగే చిత్రాలు అయినప్పటికీ... ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా చేసిన "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం సంక్రాంతి క
అంజనీపుత్ర క్రిష్ అలియాస్ జాగర్లమూడి క్రిష్. చేసింది నాలుగే చిత్రాలు అయినప్పటికీ... ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా చేసిన "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రంతో దర్శకుడిగా మరో మెట్టు పైకెక్కాడు.
దీంతో క్రిష్ సినిమా చేసేందుకు అగ్ర హీరోలే కాకుండా, యువ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్‌తో క్రిష్ తదుపరి చిత్రం ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రం పేరు రాయబారి. స్పై థ్రిల్లర్ మూవీ.
వాస్తవానికి ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌తో క్రిష్ తొలుత ప్లాన్ చేశాడు. కానీ, ఎందుకనో ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. వరుణ్ తేజ్ - ప్రగ్యా జైశ్వాల్ జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'కంచె' తర్వాత రాయబారిని పట్టాలెక్కించేందుకు క్రిష్ ఎంతగానే ప్రయత్నించినట్టు సమాచారం.
అయితే, ఇప్పుడు చరణ్ హీరోగా 'రాయబారి' ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇందుకు కారణం సుకుమార్ చిత్రం తర్వాత ఓ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేస్తానని చరణ్ ప్రకటించడమే. క్రిష్ 'రాయబారి' స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథే. అయితే, ఈ ప్రాజెక్టుపై క్రిష్ లేదా రామ్ చరణ్ ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నిజంగా ఈ ప్రాజెక్టు పట్టాలపైకెక్కితే.. ఈ తరహా స్పై థ్రిల్లర్ మూవీ రావడం టాలీవుడ్‌లో ఇదే మొదటి సారి అవుతుంది.