1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (17:04 IST)

కృష్ణవంశీ దర్శకత్వంలో ''భక్తకన్నప్ప'': శివభక్తుడిగా మంచు విష్ణు..

కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ''భక్తకన్నప్ప'' చిత్రం ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరించిందో అందరికి తెలిసిందే. అపర శివభక్తుడి గాథగా తెరకెక్కిన ఈ సినిమా తరహా కథతో త్వరలో మరో కన్నప్ప సినిమా తెరపై ఆవిష

కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ''భక్తకన్నప్ప'' చిత్రం ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరించిందో అందరికి తెలిసిందే. అపర శివభక్తుడి గాథగా తెరకెక్కిన ఈ సినిమా తరహా కథతో త్వరలో మరో కన్నప్ప సినిమా తెరపై ఆవిష్కృతం కాబోతుంది. అయితే ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయాలనీ కృష్ణంరాజు భావించారు. కానీ అనుకోకుండా ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి 'భక్త కన్నప్ప'ను తీసే ఆలోచనలో ఉందని ప్రకటించాడు. 
 
తనికెళ్ళ భరణి దర్శకత్వంలో సునీల్ హీరోగా ఈ రీమేక్ తెరకెక్కనుందని అప్పట్లో వార్తలొచ్చాయి. మొత్తానికి ఈ వార్తలన్నీ కూడా ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. తాజాగా మళ్ళీ ఈ 'భక్త కన్నప్ప' రీమేక్ వార్త టాలీవుడ్‌లో వినిపిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందనుందని మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి. తనికెళ్ళ భరణి తయారు చేసుకున్న కథతోనే కృష్ణవంశీ తెరకెక్కించనున్నాడని సమాచారం.  
 
ఇందులో మంచు విష్ణు కథానాయకుడిగా కనిపించబోతున్నారు. 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు మోహన్‌బాబు సమర్పణలో హాలీవుడ్ నిర్మాణ సంస్థ హాలీవుడ్ స్టూడియోతో కలిసి ఈ చిత్రాన్ని హీరో మంచు విష్ణు నటిస్తూ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్న వంశీ, ఆ తర్వాత మంచు విష్ణుతో తెరకెక్కబోయే సినిమా పనులు మొదలెట్టనున్నాడు.