గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (21:43 IST)

తెలుగులో జాన్వీ కపూర్- తమిళంలో ఖుషీ కపూర్..

Kushi Kapoor
Kushi Kapoor
అతిలోకసుందరి శ్రీదేవి దుబాయ్‌లో బాత్‌ టబ్‌లో ప్రాణాలు విడిచింది. ఒకప్పుడు భారత సినిమా ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవికి ప్రస్తుతం వారసులు వచ్చారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఎదిగిన శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవర అనే సినిమాలో నటిస్తోంది. 
 
ఇక శ్రీదేవి చిన్న కుమార్తె కుషీ కపూర్ కూడా అక్కలా దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా వుంది. ఇందులో భాగంగా కుషీ కపూర్ తమిళంలో అడుగుపెట్టనుంది. కుషీ కపూర్ తన మొదటి హిందీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్ ఇంకా విడుదల కానప్పటికీ, ఒక తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. మరి కుషీ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుందో లేదో చూడాలి.