గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:54 IST)

కోలీవుడ్‌కు చెందిన ఆ నలుగురు హీరోలపై నిషేధం!

dhanush
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన నలుగురు హీరోలపై తమిళ చిత్ర నిర్మాతల మండలి నిషేధం విధించింది. కాల్షీట్లు ఇచ్చిన సినిమా షూటింగులకు రాకుండా డుమ్మా కొడుతున్న హీరోలు శింబు, ధనుష్, విశాల్, అధర్వలపై తమిళ సినీ నిర్మాతల మండలి నిషేధం విధించింది. కోలీవుడ్ నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం బుధవారం చెన్నైలో జరిగింది. 
 
ఇందులో అనేక అంశాలపై చర్చించిన నిర్వాహకులు.. కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులోభాగంగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి రామస్వామి నిర్మాణంలో ధనుష్‌ హీరోగా ఓ చిత్రం పట్టాలెక్కింది. అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్‌ రాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. అందువల్ల ధనుష్‌పై నిషేధం విధించారు. 
 
మరోవైపు గతంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విశాల్‌ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, శింబు, అధ్వర్యలకు కూడా రెడ్ కార్డు వేశారు. అయితే దీనికి సంబంధించి నిర్మాతల మండలి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలోనే తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం.