బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (15:16 IST)

లావణ్య త్రిపాఠి బాగా తగ్గించేసిందట.. ఏంటది?

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ద్వారా హిట్ కొట్టిన లావణ్య త్రిపాఠికి ఆపై హిట్స్ చేతిలో లేవు. తాజాగా విడుదలైన యుద్ధం శరణం చిత్రం కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ద్వారా హిట్ కొట్టిన లావణ్య త్రిపాఠికి ఆపై హిట్స్ చేతిలో లేవు. తాజాగా విడుదలైన యుద్ధం శరణం చిత్రం కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో లావణ్య త్రిపాఠి వున్నట్లు సమాచారం. అందుకే పారితోషికాన్ని తగ్గించి.. మంచి రోల్స్, కోసం వేచి చూస్తోంది. మంచి రోల్స్ కోసం పారితోషికాన్ని తగ్గించుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.
 
ఇందులో భాగంగా 'ఉన్నది ఒకటే జిందగీ' కోసం పారితోషికం తగ్గించుకుని రూ.50 లక్షలు మాత్రమే తీసుకుందట. వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన చేస్తోన్న సినిమా కోసం కూడా అంతే మొత్తం తీసుకుందని సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. తెలుగు హిట్‌ సినిమా '100% లవ్‌'ని తమిళ్‌లో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నాగచైతన్య పాత్రలో జి.వి ప్రకాశ్‌కుమార్‌ నటిస్తున్నారు. తమన్నా పాత్రకు లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె చిత్రం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ పాత్ర  కోసం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినిని ఖరారు చేశారు.