మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (18:43 IST)

తమిళ బిగ్ బాస్ స్టార్ లోస్లియా హాట్ వీడియో లీక్..

Losliya
తమిళ బిగ్ బాస్ స్టార్ లోస్లియాకు చెందిన ఓ హాట్ వీడియో ప్రస్తుతం వైరల్ కావడం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. శ్రీలంకకు చెందిన అందాల భామ లోస్లియా మారియానేశన్ పేరెత్తితే చాలు తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. లోస్లియా మారియానేశన్ బిగ్‌బాస్ షోలో పాల్గొనకముందు శ్రీలంకలో న్యూస్ రీడర్‌గా పనిచేసేవారు. 
 
కమల్ హోస్ట్‌గా వ్యవహరించిన తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత లోస్లియా జాతకం మారిపోయింది. బిగ్‌బాస్‌లో కెవిన్‌తో రొమాన్స్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తమిళంలో క్రేజీ హీరోల సరసన నటించే అవకాశాలే కాకుండా భారీ రెమ్యునరేషన్‌తో ఛాన్సులు తన ముందుకు వచ్చాయి. ఇటీవలే లోస్లియాకు పెళ్లి జరిగిందని ప్రచారం సాగుతోంది. 
 
ఇలాంటి రూమర్ల మధ్య లోస్లియా ఓ వ్యక్తితో అతి సన్నిహితంగా ఉన్న వీడియో మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే అది వాస్తవమైన వీడియో కాదని, ఎవరో కావాలని ఆమెను బజారుకీడ్చే పనికి పూనుకొన్నారని స్నేహితులు పేర్కొంటున్నారు. ఇలా పెళ్లి ఫోటోలు, వీడియోలతో లోస్లియా జీవితం వివాదాల్లో కూరుకుపోతున్నది. అయితే ఈ ఫోటోలు, వీడియోలపై లోస్లియా ఫైర్ అయ్యింది. అవన్నీ ఉత్తుత్తివేనని.. ఫోటోలు, వీడియోల్లో నిజం లేదంటోంది. 
 
ఇకపోతే.. ప్రస్తుతం ఫ్రెండ్స్ అనే చిత్రంలో హీరోయిన్‌గా లోస్లియా ఆఫర్‌ను దక్కించుకొన్నది. యాక్షన్ కింగ్ అర్జున్, క్రికెటర్ హర్బజన్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రానికి జేపీఆర్ దర్శకుడు. అలాగే మరో తమిళ చిత్రానికి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.