సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:34 IST)

ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)

CEO dance in OFFICE
ఓ ఆఫీసులో ఉద్యోగులతో చేరి ఆ సంస్థ సీఈవో ఊరమాస్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు మానసిక ఒత్తిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మానసిక ఒత్తిడి కారణంగా వ్యాధుల బారిన పడుతున్నట్లు ఇటీవల అనేక పరిశోధనలు తేల్చాయి. 
 
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకు ఆఫీసుల్లో డ్యాన్స్, స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను కొన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెల్స్ సంస్థకు చెందిన సీఈవో దీపాళీ తన సంస్థ ఉద్యోగులను ఒత్తిడి నుంచి బయటికి తెచ్చి ఉత్సాహపరిచేలా డ్యాన్స్ చేసింది. ఆఫీస్‌ టైమ్‌లో ఊరమాస్ డ్యాన్స్ చేసిన దీపాళీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇక దీపాళీ ఉద్యోగుల వద్ద బాధ్యతగా వ్యవహరిస్తారని.. ఉద్యోగులకు అందుబాటులో వుంటూ వారికి అన్ని విధాలా సహకారం అందించే వ్యక్తి అంటూ సదరు సంస్థకు చెందిన ఉద్యోగులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంకేముంది.. సీఈవో డ్యాన్స్ ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి.