శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:51 IST)

సూపర్ ఓవర్‌లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్

సూపర్ ఓవర్‌లో క్రికెట్ బంతి తలకు బలంగా తగిలిగింది. దీంతో శ్రీలంక పేసర్ మైదానంలోనే కుప్పకూలిపోయింది. త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు సన్నాహకంగా జరిగిన వార్నప్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. 
 
ఈ వార్మప్ మ్యాచ్‌ సందర్భంగా దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాస్తంత ప్రాక్టీస్ ఉంటుందని మరో ఓవర్ ఆడించారు. ఆ సమయంలో బ్యాట్స్ వుమన్ క్లో ట్రియన్ భారీ షాట్ ఆడగా, లాంగ్ ఆఫ్2లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియ, దాన్ని అందుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. 
 
పైగా, బంతి నేరుగా ఆమె తలపై పడటంతో అక్కడికక్కడే మైదానంలో కుప్పకూలింది. క్రీడాకారిణిలు పరుగున వెళ్లి చూడగా, ఆమె స్పృహ తప్పి ఉండటంతో అందరూ కంగారు పడ్డారు.
 
వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆమెకు ప్రమాదం లేదని, కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. 
 
ఇక తాను కొట్టిన బంతికి కులసురియకు ఇలా కావడంపై క్లో ట్రియన్ కన్నీరు మున్నీరైంది. ఆమెను లంక క్రికెటర్లు ఓదార్చారు. ఈ ఘటన తర్వాత సూపర్ ఓవర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, ఆటను ముగించారు.