శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 18 మే 2016 (10:41 IST)

టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు.. ప్రిన్స్ మహేష్ బాబు ఎవరి పేరు చెప్పారు?

సాధారణంగా ఒక అగ్రహీరో ఇంకో అగ్రహీరోని పొగడటం చాల అరుదు. అలాంటిది ప్రిన్స్ మహేష్.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఏమాత్రం సంకోచించకుండా చెప్పి అందరిని అబ్బురపరిచాడు. అసలు విషయం ఏంటంటే ''బ్రహ్మోత్సవం'' చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉన్ననేపథ్యంలో మహేష్ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్నాడు. 
 
ఇందులో భాగంగానే ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికరమైన విషయాలు చెప్పాడు. టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు అసలు ఏమాత్రం ఆలోచించకుండా టక్కుమని యంగ్ టైగర్ అని చెప్పేశాడు. ఒక స్టార్ హీరో అయ్యుండి, మరో స్టార్‌ను ఇలా పొగడటం పట్ల చాలా మంది షాక్‌కి గురయ్యారు. మరి మహేష్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.