శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (14:15 IST)

మహేష్ 'సంభవామి' ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ అదుర్స్.. అభిమానుల హంగామా!

ప్రిన్స్ మహేష్ బాబు, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి 'సంభవామి' అనే పేరును ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. కానీ, ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంద

ప్రిన్స్ మహేష్ బాబు, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి 'సంభవామి' అనే పేరును ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. కానీ, ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌పై స్వయంగా మహేష్‌కు కొన్ని సందేహాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నా ఆ విషయాలను పట్టించుకోకుండా కొంతమంది మహేష్ వీరాభిమానులు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ తమకు తామే డిజైన్ చేసుకుని సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.
 
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ జనవరి ఒకటికి విడుదల కానుంది. కానీ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా మహేష్ అభిమానులు తమ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శిస్తూ ఒక ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో వాడిన బ్యాక్ గ్రౌండ్ డిజైన్ నుండి ఈ మూవీ టైటిల్ లోగో వరకు చేసిన డిజైన్ అందర్నీ ఆకర్షిస్తోంది.
 
మరికొందరైతే నిజంగా ఈసినిమాకు సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ ఇంతకన్నా బాగా మురగదాస్ డిజైన్ చేయించలేడేమో అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు. దీనితో ఈ ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూసి మురిసిపోయిన మహేష్ అభిమానులు ఒకరికొకరు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసుకుంటున్నారు.