గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2016 (12:23 IST)

రేపిస్టులకు అదే సరైన శిక్ష.. క్యాస్టేషన్ చేయాల్సిందే.. మీరా జాస్మిన్ సెన్సేషనల్ కామెంట్స్

అత్యాచారాలకు పాల్పడే దుండగులపై ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై లైంగిక దాడులను చేసేవారికి క్యాస్టేషన్ (బీజకోశాలను కత్తిరించి నపుంసకులుగా మార్చడం) ఒక్కటే సరైన శిక్ష అని ఘా

అత్యాచారాలకు పాల్పడే దుండగులపై ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై లైంగిక దాడులను చేసేవారికి క్యాస్టేషన్ (బీజకోశాలను కత్తిరించి నపుంసకులుగా మార్చడం) ఒక్కటే సరైన శిక్ష అని ఘాటుగా స్పందించింది. రేప్‌ బాధితురాళ్లపై మీరా జాస్మిన్‌ నటించిన తాజా సినిమా 'పాథు కల్పనకల్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ విలేకరుల సమావేశం నిర్వహించింది. 
 
రేపిస్టుల సైతం ఆ బాధను అనుభవించినప్పుడు ఇలాంటి ఘటనలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇటీవల కేరళలోని పెరంబవూర్‌లో దళిత మహిళ అత్యాచారానికి గురై.. హత్య చేయబడింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లితోపాటు, నటుడు అనూప్‌తో కలిసి మీరా జాస్మిన్ మీడియాతో మాట్లాడింది. 
 
ప్రస్తుతమున్న చట్టాలతో లైంగిక దాడులు వంటి నేరాలను సమర్థంగా ఎదుర్కొనలేకపోతున్నామని పేర్కొంది. మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్న వారికి నొప్పి కలిగించే శిక్షలు ఇవ్వాల్సిన అవసరమైంది. అలాంటివారిని ఎదుర్కోవడానికి క్యాస్ట్రేషన్ (అంగ విచ్ఛేదన) ఒక్కటే మార్గమని పేర్కొంది.