శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 25 మే 2017 (14:28 IST)

సమంతతో తనను అలా పిలవద్దని చెప్పారట 57 ఏళ్ల నాగార్జున

అక్కినేని నాగార్జునకు 57 ఏళ్లు వచ్చినా ఇంకా యువకుడిలానే వుంటారు. అందుకే ఆయన్ను అంతా గ్రీకు వీరుడు అని పిలుచుకుంటారు. ఆయన గ్లామర్ రహస్యం ఎన్నోసార్లు చెప్పారనుకోండి. ఇకపోతే ఇప్పుడు తనకు కాబోయే కోడలు తాత వయసున్న తనను సర్ అని పిలుస్తూ వున్నదట.

ఇంకా సర్ ఏమిటి... మావయ్యా అని పిలవాలని సమంతకు సూచించాడట నాగ్. అంకుల్ గింకుల్ ఏమీ వద్దనీ, చక్కగా తెలుగులో మావయ్యా అని పిలిస్తే చాలా సంతోషిస్తానని నాగార్జున చెప్పేశారట. మరి సమంత ఆయనను మావయ్య అని పిలుస్తుందో లేదో కానీ... ప్రేక్షకులు మాత్రం ఇంకా నాగార్జునను యువసామ్రాట్ అనే అనుకుంటున్నారు.
 
ఇకపోతే నాగార్జున ప్రస్తుతం తన పెద్ద కొడుకు నాగచైతన్య చిత్రం రారండోయ్ వేడుకచూద్దాం చిత్రం విడుదల బిజీలో వున్నారు. ఈ చిత్రం విడుదలయ్యాక సమంత-నాగచైతన్య పెళ్లిపై క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. మరి పెళ్లెప్పుడు చేస్తారో వెయిట్ అండ్ సీ.