శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (11:12 IST)

"గుంటూర్ టాకీస్" సీక్వెల్‌లో హాట్ బ్యూటీ నమిత... సన్నీ లియోన్ కూడా...

బుల్లితెర యాంకర్ 'రేష్మి' ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గుంటూరు టాకీస్'. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బిగ్ హిట్ అయ్యింది. ఆ ఒక్క మూవీతో హాట్ హీరోయిన్‌గా రేష్మి మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఆ

బుల్లితెర యాంకర్ 'రేష్మి' ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గుంటూరు టాకీస్'. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బిగ్ హిట్ అయ్యింది. ఆ ఒక్క మూవీతో హాట్ హీరోయిన్‌గా రేష్మి మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఆ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో రేష్మికి ఆఫర్లు క్యూ కట్టాయి. యూత్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా సీక్వెల్ తీస్తున్నారు. నూతన దర్శకుడు రాజ్‌కుమార్ సువీయ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలో విడుదల చేయాలని చిత్ర యోనిట్ యోచిస్తోంది. 
 
ఇందులో 'సన్నీ లియోన్' నటిస్తోందని టాక్. తాజాగా ఈ చిత్రంలో 'నమిత' కూడా నటిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. తమిళంలో స్టార్ హీరోస్‌కు ఉన్న క్రేజ్ 'నమిత'కు ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నమిత తర్వాత సరైన ఆఫర్లు రాక సక్సెస్ కాలేదు. కానీ నమిత చేసిన మూవీలతో హాట్ ఇమేజ్ వచ్చింది. తెలుగులో చివరిగా బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ 'సింహా'లో కనిపించింది నమిత. ఈ చిత్రం 2010లో విడుదలైంది. 
 
అనంతరం ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం 'గుంటూరు టాకీస్ -2'లో 'నమిత' ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. 'నమిత'తో ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందని, ఆమె కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతుందని తెలుస్తోంది. సో... చాలా రోజులకు ఓ బోల్డ్ కంటెంట్ మూవీతో నమిత టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతోంది.