రజనీ తమిళుడే.. ఆయన స్థాపించే పార్టీలో చేరుతాం : మద్దతు ప్రకటించిన హీరోయిన్లు
తమిళ రాజకీయాల్లోకి రజనీకాంత్ అడుగుపెట్టబోతున్నారన్న వార్త ఆ రాష్ట్ర రాజకీయ నేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది. ఇప్పటికే రజనీ రాజకీయాల్లోకి రాకూడదని పలు తమిళ సంఘాలు ఆందోళన కూడా చేశాయి.
తమిళ రాజకీయాల్లోకి రజనీకాంత్ అడుగుపెట్టబోతున్నారన్న వార్త ఆ రాష్ట్ర రాజకీయ నేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది. ఇప్పటికే రజనీ రాజకీయాల్లోకి రాకూడదని పలు తమిళ సంఘాలు ఆందోళన కూడా చేశాయి.
అదేసమయంలో పలువురు రాజకీయ నేతలు రజనీకాంత్ స్థానిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న వారిలో కేవలం రాజకీయ నేతలే కాదు.. భారతీరాజా వంటి అగ్ర దర్శకులు కూడా ఉన్నారు.
అదేసమయంలో రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో, ప్రముఖ సీనీ హీరోయిన్లు మీనా, నమితలు రజనీకి తమ మద్దతును ప్రకటించారు. అంతేకాదు, రజనీ పెట్టబోయే పార్టీలో చేరేందుకు కూడా వీరు సిద్ధమయ్యారు.
ఇదిలావుండగా, ఆగస్టు 15వ తేదీన రజనీకాంత్ తన కొత్త పార్టీ గురించి అధికారికంగా ప్రకటించనున్నారనే వార్త తమిళనాట హల్‌చల్ చేస్తోంది. పార్టీ జెండాను కూడా ఇప్పటికే డిజైన్ చేశారనే ప్రచారం ఉంది.