బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (17:11 IST)

మొత్తం ఊడ్చుకుపోయాక భూమికకు బుద్ధి వచ్చిందా?(ఓల్డ్ వీడియో)

ధనమేరా అన్నిటికీ మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం... అనే పాటలో సత్యం ఎందరికి తెలుసు. ధనం పోగొట్టుకున్నవారికే తెలుసు. ఇప్పుడు భూమికకు కూడా తెలిసి వచ్చిందంటున్నారు టాలీవుడ్ సినీజనం. రోజాపూలు, ఖుషీ, ఒక్కడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె నటించిన చిత్

ధనమేరా అన్నిటికీ మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం... అనే పాటలో సత్యం ఎందరికి తెలుసు. ధనం పోగొట్టుకున్నవారికే తెలుసు. ఇప్పుడు భూమికకు కూడా తెలిసి వచ్చిందంటున్నారు టాలీవుడ్ సినీజనం. రోజాపూలు, ఖుషీ, ఒక్కడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె నటించిన చిత్రాలెన్నో సూపర్ హిట్స్. డబ్బులే డబ్బులు. 
 
ఐతే ఆ డబ్బుల్ని తనకుగాని పనులకు పోయి పోగొట్టుకున్నదంటూ వార్తలు వస్తున్నాయి. ఉన్న డబ్బుకు మరికాస్త చేర్చుకునేందుకే ఎవరయినా వ్యాపారం చేస్తుంటారు. అలాగే భూమిక చావ్లా కూడా చేసింది. సినిమాలు తీసింది. పత్రిక పెట్టింది. కానీ అనుభవం లేని ఫీల్డ్ కావడంతో జలగలు కాచుకుని కూర్చుంటాయి కాబట్టి మొత్తం పీల్చేశాయని చెప్పుకుంటున్నారు.
 
తను హీరోయిన్‌గా నటించుకుంటూ నమ్ముకున్న వృత్తిలోనే వెళితే ఫలితం బావుండేది కానీ వేరే పడవలపై కాళ్లు పెట్టేసరికి అంతా మునిగిపోయింది. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. కాకపోతే హీరోయిన్ వేషాలు ఎలాగూ రావు కనుక సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. ఇలాగైనా భూమిక నిలదొక్కుకుంటుందని ఆశిద్దాం. ధనలక్ష్మి మళ్లీ ఆమెను వరించాలని కోరుకుందాం. చూడండి ధనమేరా అన్నిటికీ మూలం పాటను ఈ వీడియోలో...